: దిగివచ్చిన బంగారం ధర.. వెండి కూడా!
స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో ఈ రోజు బంగారం ధర దిగివచ్చింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ఈ రోజు రూ.250 తగ్గి రూ.29,100గా నమోదైంది. అంతర్జాతీయంగా కూడా బంగారం కొనుగోళ్లు తగ్గాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు వెండి ధర కూడా ఈ రోజు రూ.450 తగ్గి కిలో వెండి ధర రూ.40 వేలు పలికింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర 0.02 శాతం తగ్గి, ఔన్సు 1,262.60 అమెరికన్ డాలర్లుగా నమోదైంది.