: రాజశేఖర్, జీవితల కూతురు ఫోటో షూట్ అదుర్స్!


వెండితెరపై వెలిగేందుకు మరో సినీ దంపతుల కుమార్తె వచ్చేస్తోంది. హీరో రాజశేఖర్, జీవితల కుమార్తె శివానీ త్వరలోనే తెరంగేట్రం చేయనుందనే వార్తలు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. శివానీని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తామని ఇప్పటికే రాజశేఖర్, జీవితలు ప్రకటించారు. అయితే, ఎప్పుడనే విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదు.

 ఈ నేపథ్యంలో, శివానీ ఈ మధ్య చేసిన ఓ ఫొటో షూట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. హీరోయిన్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో ఫొటోలలో శివానీ అదరగొడుతుండటంతో... ఆమె ఎంట్రీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పుకుంటున్నారు. మరోవైపు, శివానీని తమ సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేసేందుకు టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన పలువురు నిర్మాతలు ఇప్పటికే రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News