: ఫాంహౌస్ కు చేరుకున్న దాసరి భౌతికకాయం.. కాసేపట్లో అంత్యక్రియలు


దర్శకరత్న దాసరి నారాయణరావు పార్థివదేహం హైదరాబాద్ మొయినాబాద్ లో ఉన్న ఆయన ఫామ్ హౌస్ కు చేరుకుంది. ఫిలిం ఛాంబర్ నుంచి ఆయన భౌతికకాయాన్ని ఫాం హౌస్ కు తరలించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన భౌతికకాయం వెంట తరలి వచ్చారు. దాసరి పార్థివదేహం ఫామ్ హౌస్ కు చేరుకోగానే, పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. మరోవైపు ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అంత్యక్రియలు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయన అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరగనున్నాయి. 

  • Loading...

More Telugu News