: జాతీయ రహదారి సమీపంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఆర్మీ హెలికాప్టర్
జైపూర్-ఆగ్రా జాతీయ రహదారి సమీపంలోని దయరాంపుర గ్రామంలోని మైదానంలో ఈ రోజు భారత ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఈ విషయంపై సంబంధిత అధికారులు వివరాలు వెల్లడిస్తూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. ఆ సమయంలో హెలికాప్టర్‌లో పైలట్ సహా ముగ్గురు ఉన్నారని, వారంతా క్షేమంగా బయటపడ్డారని తెలిపారు. ఆ హెలికాప్టర్ ఆగ్రా నుంచి జైపూర్‌కి వెళుతుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని, ఆ ప్రాంతంలో ల్యాండ్ చేయడం వల్ల హెలికాప్టర్ కి ఎటువంటి డ్యామేజ్ జరగలేదని వివరించారు.