: ధోనీ క్యాచ్ మిస్ చేస్తే కోహ్లీ నవ్వేశాడు... మీరు కూడా చూడండి!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రెండో సన్నాహక మ్యాచ్ లో టీమిండియా, బంగ్లాదేశ్ తో ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన మహేంద్ర సింగ్ ధోనీ... మ్యాచ్ లోని విరామంలో సహచరులకు వాటర్ బాటిల్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చాడు. ఈ సమయంలో అభిమానులు కేరింతలు కొట్టారు. ధోనీలాంటి సీనియర్ ఆటగాడు వాటర్ అందించేందుకు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
అలాగే మ్యాచ్ ముగింపుకు ముందు... బంగ్లా బ్యాటింగ్ చివర్లో సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలో దిగిన ధోనీ పదో నంబర్ ఆటగాడు గాల్లో లేపిన సులభమైన క్యాచ్ ను పట్టుకునేందుకు ముందుకు దూసుకెళ్లి... చేతులు చాచకుండా వదిలేశాడు. అప్పటికే టీమిండియా భారీ విజయం ఖాయమైన నేపథ్యంలో ధోనీ సరదాగా ఇలా చేయడంతో ధోనీని చూసి కెప్టెన్ కోహ్లీ ముందు అదేంటి? అన్నట్టు ఆశ్చర్యపోయినా... తరువాత ధోనీ తీరు చూసి హాయిగా నవ్వేశాడు. వీరికి టీం సహచరులు కూడా జత కలిశారు. అనంతరం మరొక్క పరుగు జతచేసిన బంగ్లాదేశ్ జట్టు ఆలౌట్ అయింది.
— Ashok Dinda (@lKR1088) May 31, 2017
— Ashok Dinda (@lKR1088) May 31, 2017