: షారూఖ్ షూటింగు సెట్లో ఊడిపడిన సీలింగ్.. తప్పిన ప్రమాదం


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పిందని ముంబై మిర్రర్ పత్రిక తెలిపింది. షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ కాంబినేషన్ లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, ఏర్పాటు చేసిన సెట్ సీలింగ్ ఊడి అమాంతం కిందపడింది. అయితే, షారూఖ్ స్టూలు వేసుకుని కూర్చున్న ప్రాంతానికి కొంచెం పక్కన ఇది జరగడంతో ఆయనకు ఏమీ కాలేదు. దీంతో, యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ఈ ఘటనలో ఇద్దరు యూనిట్ సభ్యులు గాయపడ్డారని తెలుస్తోంది. దీంతో షూటింగ్ ను రద్దు చేశారని, వచ్చేవారం ఈ షూటింగ్ మొదలు పెడతారని ఆ పత్రిక తెలిపింది. 

  • Loading...

More Telugu News