: కాబూల్ లోని ఇండియన్ ఎంబసీ ఎదుట భారీ పేలుడు


ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని భారత ఎంబసీ ముందు ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో పెద్ద ఎత్తున ధూళి మేఘాలు కమ్ముకున్నాయి. భారత ఎంబసీ భవంతి అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. అధికారులంతా క్షేమమేనని, ఈ పేలుడు ఇండియా దౌత్యకార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగింది కాదని ఆఫ్ఘన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ పేలుడు జరిగిన ప్రాంతంలోనే అధ్యక్ష నివాసం, పలు దేశాల ఎంబసీలు ఉన్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలో పేలుడు కలకలం సృష్టించింది. పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి వుంది.

  • Loading...

More Telugu News