: నెరవేరకుండా పోయిన దాసరి చివరి కల!
దర్శకరత్న దాసరి తన చివరి కోరికను నెరవేర్చుకోకుండానే వెళ్లిపోయారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితపై ఓ చిత్రాన్ని తీయాలనుకున్న ఆయన కోరిక నెరవేరలేదు. జయ మృతి తరువాత ఆమె జీవిత చరిత్రలో తనకు తెలిసిన విషయాలతో పాటు, తెలియని విషయాల గురించి పలువురితో దాసరి చర్చలు కూడా జరిపారు. తాను నిర్మించ తలపెట్టిన జయలలిత బయోపిక్ కు 'అమ్మ' అన్న టైటిల్ ను కూడా అనుకున్నారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ తో కలసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని కూడా భావించారు. ఓ సినిమా ఫంక్షన్ లో ఇదే విషయాన్ని దాసరి చెప్పగా, పవన్ సైతం ఆయనతో తన చిత్రం తప్పకుండా ఉంటుందని అన్నారు కూడా. ఇక ఆయన మరణంతో ఈ ప్రాజెక్టులు ఆగినట్టే. ఇలా తన చివరి కోరికలు తీరకుండానే ఆయన పరలోకానికి వెళ్లిపోయారు.