: పెళ్లిలో చిందేసి డబ్బులు విసిరిన మంత్రి.. పట్టుకున్న చిన్నారులను చితకబాదిన అమాత్యుడు


మధ్యప్రదేశ్ పౌరసరఫరాల శాఖామంత్రి ఓం ప్రకాశ్ ధ్రువే పిల్లల్ని పట్టుకుని చితకబాదిన ఘటన శివరాజ్‌సింగ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. చిన్నారులను మంత్రి కొడుతున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. మంత్రి ఇలా వ్యవహరించడం ఇదేమీ కొత్తకాదు. ఇటీవల ఓ జిల్లాలో ప్రభుత్వ అధికారులపై బహిరంగంగానే దుర్భాషలాడుతూ వీరంగమేశారు. తాజాగా మంగళవారం ఓ వివాహానికి హాజరైన మంత్రి డ్యాన్స్ చేస్తూ కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరారు. వాటిని పట్టుకునేందుకు ఎగబడిన చిన్నారులపై మంత్రి విరుచుకుపడ్డారు. వారిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఆయన దాడిలో పలువురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News