: నిషేధిత జాబితా నుంచి గేదెలకు మినహాయింపు ఇవ్వండి.. ప్రభుత్వానికి ఎగుమతిదారుల మొర!


బహిరంగ మార్కెట్ల నుంచి వధశాలలకు పశువులను విక్రయించడాన్ని ప్రభుత్వం నిషేధించడంతో జంతుచర్మాల ఎగుమతిదారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిషేధిత జాబితా నుంచి గేదెలను తొలగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వశాఖను కలిసి విన్నవించాలని నిర్ణయించారు. నిషేధిత జాబితా నుంచి ఒక్క గేదెలను తప్పిస్తే చాలని, తమ ఆందోళనంతా గేదెలను ఆ జాబితాలో చేర్చడంపైనేనని కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ వైస్ చైర్మన్ అకీల్ పునారున పేర్కొన్నారు.

మంగళవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఈ విషయాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి తమ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రభుత్వాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. కాగా, 2016-17లో 5.66 బిలియన్ డాలర్ల  (దాదాపు రూ.36,577 కోట్లు) జంతు చర్మాల ఎగుమతులు జరగ్గా అందులో అధిక మొత్తం గేదె చర్మాల ఎగుమతుల వల్ల వచ్చిందే.

  • Loading...

More Telugu News