: దాసరి చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారు.. బతికించుకోలేకపోయాం: కిమ్స్ వైద్యులు
దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు ఐసీయూలో చికిత్స పొందుతూ గుండెపోటుకు గురయ్యారని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఆయనను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఆయన మృతి చెందారని తెలిపారు. ఇది అందరినీ విషాదంలో ముంచే వార్త అని పేర్కొన్నారు. దాసరి మరణవార్తను తెలుసుకొని కిమ్స్ ఆసుపత్రి వద్దకు సినీ పరిశ్రమ పెద్దలు, దాసరి అభిమానులు తరలివస్తున్నారు. ఆయన ఇకలేరన్న వార్తను తెలుగు సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది.