: మద్రాస్ ఐఐటీలో 'బీఫ్ ఫెస్టివల్' నిర్వహించిన విద్యార్థిపై దాడి.. ఆసుపత్రిలో యువకుడు!
పశువుల రవాణా, వధపై కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ నిబంధనలను ధిక్కరించే రీతిలో మద్రాస్ ఐఐటీలోని ఓ వర్గం విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని, పశుమాంసాన్ని వండుకొని తిన్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థి నాయకుడు సూరజ్‌పై ఇతర గ్రూప్‌కి చెందిన విద్యార్థులు దాడి చేశారు. ఆ విద్యార్థికి గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థి కేరళకు చెందిన యువకుడని తెలిపారు. మరోవైపు సూరజ్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.