: టీమిండియాను ఆకాశానికెత్తేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర‌


క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2017 ఎల్లుండి నుంచి ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. గ‌త ఛాంపియ‌న్స్ ట్రోఫీలో క‌ప్ కొట్టేసిన టీమిండియానే ప్ర‌స్తుత ట్రోఫీలోనూ ఫేవ‌రేట్‌గా ఉంది. జ‌ట్టు ప్ర‌స్తుతం అన్ని విభాగాల్లోనూ ప‌టిష్టంగా ఉండ‌డం టీమిండియా ప్లస్ పాయింట్‌. తాజాగా ఛాంపియ‌న్స్ ట్రోఫీపై స్పందించిన శ్రీలంక క్రికెట్ టీమ్‌ మాజీ కెప్టెన్ కుమార సంగక్కర టీమిండియాను ఆకాశానికెత్తేశాడు. టీమిండియా సమతుల్యంగా ఉందని, ముఖ్యంగా పేస్ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉందని ఆయ‌న అన్నాడు. అశ్విన్, జడేజా వంటి టాప్ స్పిన్నర్లు టీమిండియాలో ఉన్నారని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పాడు.                      

  • Loading...

More Telugu News