: నిరుద్యోగులకు శుభవార్త.. 20 వేల ఉద్యోగ నియామకాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్


తెలంగాణలోని నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభ‌వార్త తెలిపారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో 20వేల ఉద్యోగాల నియామకాలకు అనుమ‌తినిచ్చారు. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగ నియామ‌కాలు చేపట్టాలని టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణికి కేసీఆర్ సూచించారు. 84 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1428 ఉద్యోగాలు, కొత్త జిల్లా కేంద్రాల్లోని 29 పట్టణ గురుకులాల్లో 377 ఉద్యోగాల నియామకాలు, రాష్ట్రంలోని వివిధ పాఠ‌శాల‌ల్లో మొత్తం 8792 ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ ప్ర‌భుత్వం భర్తీ చేయ‌నుంది. వీటికోసం వెంటనే నోటిఫికేషన్‌ జారీచేయాలని కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.             

  • Loading...

More Telugu News