: మళ్లీ సస్పెండ్ అయిన అభిజీత్ ట్విట్టర్ ఖాతా


ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు అభిజీత్‌ భట్టాచార్య జేఎన్యూ విద్యార్థిని గురించి అసభ్యకరంగా వ్యాఖ్యానించాడంటూ అతని ట్విట్టర్‌ ఖాతాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. నిన్న అతని ఖాతాను మళ్లీ యాక్టివేట్‌ చేశారు. ఈ నేపథ్యంలో, ‘‘వందేమాతరం. నేను మళ్లీ వచ్చేశాను. దేశద్రోహులు నా నోరు మూయించలేరు. భారత సైన్యానికి నా శాల్యూట్‌’ అంటూ అతను ఓ వీడియోను పోస్టు చేశాడు. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేశారో లేక ట్విట్టర్ పొరపాటున యాక్టివేట్ చేసి సరిదిద్దుకుందో కానీ... మళ్లీ అతని ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసింది. దీనిపై అభిజీత్ స్పందించాల్సి ఉంది. కాగా, అభిజీత్ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేశారన్న ఆగ్రహంతో మరో బాలీవుడ్ నటుడు సోనూ నిగమ్ ట్విట్టర్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News