: సస్పెండ్ చేస్తే మళ్లీ ఉద్యోగంలోకి రావచ్చనుకుంటున్నారా?... ఇక డిస్మిస్సే!: ఉద్యోగులకు యోగి వార్నింగ్
తప్పు మీద తప్పులు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ఇకపై ఎంతమాత్రమూ సహించేది లేదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సస్పెన్షన్ వేటుకు గురైన అధికారులు, కొంతకాలం తరువాత తిరిగి విధుల్లోకి చేరుతున్నారని, ఇకపై అటువంటిది ఉండబోదని చెప్పారు. అధికారి తప్పు చేస్తూ పట్టుబడితే, డిస్మిస్ చేసి శాశ్వతంగా ఉద్యోగానికి దూరం చేస్తామని హెచ్చరించారు. అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలన తదితర విషయాల్లో అలసత్వం వహిస్తే సహించబోనని తేల్చి చెప్పారు.