: తెల్లారితే పెళ్లి... రాత్రి ఆమె జీవితాన్ని కాటేసిన కామాంధుడు!
తెల్లారితే పెళ్లి జరగాల్సిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం డి.ముప్పవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డి.ముప్పవరం గ్రామానికి చెందిన యువతి (18)కి సోమవారం ఉదయం వివాహ ముహూర్తం నిశ్చయించారు. దీనికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే ఆదివారం రాత్రి ఆమె గ్రామం బయటకు బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు కొందరు స్నేహితుల సాయంతో ఆమె నోరు మూసి, దగ్గర్లోని చెరుకుతోటలోకి బలవంతంగా తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
బహుర్భూమికి వెళ్లిన యువతి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కలసి గాలింపు చేపట్టారు. ఆఖరికి సోమవారం సాయంత్రం గ్రామానికి దగ్గర్లోని చెరకు తోటలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వధువును పశువుల కాపరులు గుర్తించి, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని 108 వాహనంలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్నారు. అనంతరం స్పృహలోకి వచ్చిన ఆమెను ప్రశ్నించగా మల్లిపూడి సత్యనారాయణ అనే యువకుడు తనపై అత్యాచారం చేశాడని తెలిపింది.