: ఆత్మహత్య చేసుకున్న వివాహితను అత్తింట్లోనే ఖననం చేసిన ఆమె కుటుంబసభ్యులు!


వరంగల్ అర్బన్ లోని ఏనుమముల‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాధిక అనే వివాహిత ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే, ఆమెది ఆత్మ‌హ‌త్య కాద‌ని అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నార‌ని, త‌మ కూతురిని హ‌త్య‌చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని రాధిక త‌ల్లిదండ్రులు ఆరోపించారు. రాధిక‌కు ముగ్గురు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు రాధిక భర్త విజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాధిక మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులు ఆమె అత్తింట్లోనే ఖ‌న‌నం చేశారు. ఆ స‌మ‌యంలో పోలీసుల‌కు, రాధిక కుటుంబ స‌భ్యుల‌కు మ‌ధ్య వాగ్వివాదం చెల‌రేగింది. పోలీసులను వారు నిర్బంధించి మ‌రీ ఆ ప‌నిచేశారు.

  • Loading...

More Telugu News