: పాకిస్థాన్ కు షాక్ ఇస్తున్న అమెరికా
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు అమెరికా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. పాక్‌కు తాము గతంలో చేసిన సాయాన్ని అప్పుగా పరిగణిస్తున్నామని అమెరికా ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్‌కు వీసాల మంజూరు విషయంలోనూ కఠినంగానే వ్యవహరిస్తోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చాక పలు ముస్లిం దేశాల నుంచి వస్తున్న పౌరులకు వీసాలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఆ దేశాల జాబితాలో పాక్ లేకపోయినప్పటికీ పాక్‌కు మార్చి-ఏప్రిల్ నెలల్లో 40 శాతం వీసాలను తగ్గించింది. తమ దేశ పౌరులకు అమెరికా ఈ ఏడాది మార్చిలో 3,973 వీసాలు, ఏప్రిల్‌లో 3,925 వీసాలను మాత్రమే మంజూరు చేసిందని పాకిస్థాన్ పేర్కొంది. ఇతర ముస్లిం దేశాలకు కూడా వీసాల మంజూరులో అగ్రరాజ్యం సగటున 20 శాతం మేర కోత విధించింది. అయితే, గతేడాదితో పోలిస్తే భారతీయులకు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల మంజూరు 28 శాతం పెరగడం విశేషం!