: తెలుగుదేశం పార్టీ జాతీయాధ్య‌క్షుడిగా మరోసారి ఏక‌గ్రీవంగా ఎన్నికైన చంద్ర‌బాబు


విశాఖ‌ప‌ట్నంలో జ‌రుగుతున్న టీడీపీ మ‌హానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయాధ్య‌క్షుడిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని ఆ పార్టీ నేత‌లు ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక కోసం నిన్న మధ్యాహ్నమే నోటిఫికేషన్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి మొత్తం 33 నామినేషన్లు రాగా, అవన్నీ చంద్రబాబుకు అనుకూలంగానే దాఖలయ్యాయి. చంద్రబాబు నాయుడికి టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పగుచ్ఛాలు అందించారు. శంఖం పూరించి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుని అభినందించారు. త‌న‌ను ఎన్నుకున్న త‌రువాత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌సంగిస్తున్నారు. 

  • Loading...

More Telugu News