: ఫ్లిప్కార్ట్లో బంపర్ ఆఫర్లు!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తమ వినియోగదారుల ముందు మరోసారి ఆఫర్ల వర్షం కురిపించింది. మరో సమ్మర్ సేల్ పేరిట ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు పలు వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా స్మార్ట్పోన్లు, హోమ్ అప్లియెన్స్ లపై 10వేల రూపాయల వరకు, జియోర్డోనో వాచ్ లు, మహిళల ప్రీమియం బ్యాగులపై 75 శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. అంతేగాక సిటీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేసిన వినియోగదారులకు అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తుంది.
ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ఇతర ఆఫర్ల వివరాలు...
- ఆపిల్ వాచ్ సిరీస్ 2 పై 14 శాతం తగ్గింపు
- 40 అంగుళాల సోని టెలివిజన్ పై 20 శాతం తగ్గింపు
- ఫిట్ నెస్ ప్రొడక్ట్స్ పై 80 శాతం వరకు తగ్గింపు
- నికోన్ డీఎస్ఎల్ఆర్ కెమెరాపై 20 శాతం తగ్గింపు
మరిన్ని వివరాల కోసం ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ చూడొచ్చు.