: మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ కుమారుడికి ఐదేళ్ల జైలు శిక్ష


మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కుమారుడు అజయ్ మీతాయ్ సింగ్ కు ఓ ట్రయల్ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. 2011లో అజయ్, తన వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారకుడు కాగా, కేసును విచారించిన న్యాయస్థానం సెక్షన్ 304 (దోషరహిత నరహత్య - కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్), మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్లను ఉటంకిస్తూ తీర్పు ఇచ్చింది. కేసు విచారణ దశలో ఉండగానే బీరేన్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆపై మృతుడి బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించి, తమకు బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ లేకుండా పోయిందని, మణిపూర్ కోర్టులో తమ తరఫున వాదించేందుకూ న్యాయవాదులు ఆసక్తి చూపడం లేదని పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి, మణిపూర్ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేసులో తీర్పు వెలువడటం గమనార్హం.

  • Loading...

More Telugu News