: అబ్బ... భ్రమరాంబ నాకెంత నచ్చేసిందో!: రకుల్ ప్రీత్ సింగ్
'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలోని భ్రమరాంబ క్యారెక్టర్ తనకు ఎంతో నచ్చిందని టాలీవుడ్ యువనటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భ్రమరాంబ చాలా మంచి అమ్మాయని చెప్పింది. అంతే కాకుండా గ్లామరస్ గా మాత్రమే కాకుండా సెన్సిబుల్ గా కూడా ఉంటుందని చెప్పింది. చాలా హుందాగా, చక్కగా ఉంటుందని, అమాయకత్వంతో కనబడడంతో ఈ క్యారెక్టర్ తనకు ఎంతో నచ్చిందని తెలిపింది.
తన చుట్టూ చాలా పాజిటివ్ గా ఉండేలా చూసుకుంటుందని చెప్పింది. అలాగే భ్రమరాంబలో నచ్చని అంశాలు కూడా ఉన్నాయని చెప్పింది. భ్రమరాంబ చాలా స్వార్థపరురాలని, అయితే ఆమెకు ఆ విషయం తెలియదంది. అమాయకత్వం, మంచితనం ఆమె స్వార్థాన్ని డామినేట్ చేస్తాయని పేర్కొంది. పాత్ర అంత చక్కగా ఉంది కనుకే తనకు ఈ సినిమాపై ప్రత్యేకమైన ప్రేమ కలిగిందని తెలిపింది. తనతో పాటు సినిమా చూసే ప్రేక్షకులకు కూడా భ్రమరాంబ క్యారెక్టర్ చాలా నచ్చేస్తుందని, దర్శకుడు అంత చక్కగా తన పాత్రను తీర్చిదిద్దాడని చెప్పింది. పాత్ర పరిధిమేరకు తాను నటించానని, అది కూడా నచ్చిందని చెప్పింది.