: 10,000 కోట్ల భూ కుంభకోణం జరగలేదు...అంతా కట్టుకధ!: శ్రీనివాసరావు


హైదరాబాదులోని కూకట్ పల్లి రెవెన్యూ పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 100 లో 207 ఎకరాలు, సర్వే నెంబర్ 101లో 231 ఎకరాలు, సర్వే నెంబర్ 20లో 109 ఎకరాలు, సర్వే నెంబర్ 28లో 145 ఎకరాలు.. ఇలా పది వేల కోట్ల రూపాయల విలువైన 692 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు కట్టబెట్టారంటూ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మియాపూర్ లో భూదందా జరగలేదని అన్నారు. తప్పుడు కథనాలు ప్రచారమవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. విధుల్లో, చట్టప్రకారం తాము నడిచామని తెలిపారు. చట్టప్రకారమే రిజిస్ట్రేషన్ చేశామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆయన చెప్పారు. తాము నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పని చేయలేదని ఆయన తెలిపారు. గవర్నమెంట్ ల్యాండ్స్ విషయంలో ఇంతవరకు నోటిఫికేషన్ వంటివేవీ లేవని ఆయన చెప్పారు. ఈ ఆరోపణలు, వివాదం, స్కాం అంతా ఫ్యాబ్రికేటెడ్ అని, తనపై గిట్టనివారెవరో దీనిపై కట్టుకధలు అల్లారని ఆయన ఆరోపించారు. 

  • Loading...

More Telugu News