: చేరికలకు వేళాయే... నేడు టీఆర్ఎస్ లో చేరనున్న టీడీపీ, కాంగ్రెస్ నేతలు
నిన్నటి వరకూ వేర్వేరు పార్టీ నేతలుగా ఉన్న వారు నేడు గులాబీ కండువాలను కప్పుకోనున్నారు. నేడు టీఆర్ఎస్ లో చేరేందుకు తెలుగుదేశం మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కాంగ్రెస్ నేత పైడిపల్లి రవీందర్ రావు సిద్ధమయ్యారు. ఈ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో కేసీఆర్ సమక్షంలో వీరు తెరాసలో చేరనున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు మేలు కలిగించేలా ఉండటం నచ్చిందని, కేసీఆర్ స్వయంగా ఆహ్వానించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నానని రమేష్ రాథోడ్ వ్యాఖ్యానించారు. తనతో పాటు భారీ సంఖ్యలో అనుచరులు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారని తెలిపారు. విశాఖపట్నంలో మహానాడు జరుగుతున్న సమయంలోనే రమేష్ రాథోడ్ పార్టీని ఫిరాయించడం గమనార్హం.