: లక్ష కోట్ల అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ: ఏపీ మంత్రి సోమిరెడ్డి
లక్ష కోట్ల అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అటువంటి పార్టీ నేతలకు తమ పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. టీడీపీ ఒక నిజాయతీపరుడు పెట్టిన పార్టీ అని అన్నారు. 50 వేల మందితో మూడు రోజులపాటు మహానాడు నిర్వహించడం ఒక చరిత్ర అని అన్నారు. వైసీపీ నేతలు మహానాడుని కూడా విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. మూడు నెలలకోసారి రెండ్రోజుల దీక్ష చేయాలని జగన్‌కు వైద్యులు సూచించారని, అందుకే జగన్ దీక్షలు చేస్తుంటారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఏ సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేసిందో చెప్పాలని ఆయన అన్నారు.