: ఆ దర్శకుడంటే నాకు చాలా చాలా ఇష్టం: విజయేంద్ర ప్రసాద్
బాహుబలి, భజరంగీ భాయిజాన్ వంటి ఎన్నో సినిమాలకు కథా రచయితగా పనిచేసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన కుమారుడిని పక్కన పెడితే, తనకు బాగా నచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ అని అన్నారు. ఆ దర్శకుడంటే తనకు చాలా చాలా ఇష్టమని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను ఏ సినిమా పనైనా మొదలుపెట్టేటప్పుడు షోలే సినిమా చూస్తానని, ఆ సినిమా చూసి స్ఫూర్తిని పొందుతానని అన్నారు.
తనకు ఇటీవల వచ్చిన సినిమాల్లో పెళ్లి చూపులు, శతమానం భవతి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 సినిమాలు బాగా నచ్చాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక సంగీత దర్శకుడు కీరవాణి గురించి మాట్లాడుతూ... కీరవాణి తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో ఆదుకున్నాడని అన్నారు. తాను పవన్ కల్యాణ్‌ను సినిమా స్టార్‌గానే కాకుండా ఓ వ్యక్తిగా కూడా ఎంతో ఇష్టపడతానని చెప్పారు.