: అందుకే, ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ డైలాగుపై స‌మంత అలా రిప్లై ఇచ్చింది: నాగ‌చైత‌న్య‌


తాను న‌టించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి హానిక‌రం అన్న డైలాగుపై త‌న ప్రియురాలు స‌మంత ఎలా స్పందించింద‌నే ప్ర‌శ్న‌కు అక్కినేని నాగ‌చైతన్య స‌మాధానం చెబుతూ ‘స‌మంత ఆ డైలాగు వేరే అమ్మాయిల గురించి అంటూ రిప్లై ఇచ్చింది క‌దా?’ అన్నాడు. ఈ రోజు ఆయ‌న ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... త‌న సినిమా బాగుంటే త‌న కంటే ఎక్కువగా సమంతానే ఎక్సైట్ అవుతుంద‌ని అన్నాడు.

తాను ఉత్సాహాన్ని త‌న‌లోనే దాచుకుంటాన‌ని, స‌మంత మాత్రం అలాకాద‌ని అన్నాడు. ఈ సినిమాలో మాత్రం తాను ఏ ఎమోష‌న్ అయినా వెంట‌నే బయ‌ట‌కు చూపిస్తాన‌ని చెప్పాడు. తాను అన్నీ ల‌వ్ స్టోరీ సినిమాల్లోనే నటిస్తున్నాన‌ని, అయిన‌ప్ప‌టికీ త‌న‌కు లవ్ అంటే బోర్ రాలేదని అన్నాడు. త‌న‌కు స్టేజీ అంటే భయమ‌ని, పబ్లిక్ పంక్ష‌న్స్‌లో మైకు ఇచ్చి మాట్లాడమంటే భ‌యప‌డ‌తాన‌ని చెప్పాడు. త‌న సినిమాలో చెప్పిన‌ట్లు నిజానికి అమ్మాయిలు మ‌న‌శ్శాంతికి హానిక‌రం కాద‌ని అన్నాడు.

  • Loading...

More Telugu News