: జైపూర్ లో ‘బాహుబలి 2’ సినిమా చూడ్డానికి వెళ్లి త‌ప్పిపోయిన ముగ్గురు చిన్నారులు


‘బాహుబలి 2’ సినిమా చూడ్డానికి వెళ్లి ముగ్గురు చిన్నారులు త‌ప్పిపోయిన ఘ‌ట‌న రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో చోటుచేసుకుంది. ఆ పిల్ల‌లను ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్న పోలీసులు వారిని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. ఆ ముగ్గురు చిన్నారులూ రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా ‘బాహుబలి 2’ సినిమా చూడ్డానికి వెళ్లార‌ని, కానీ వారికి టికెట్లు దొరకలేదని పోలీసులు చెప్పారు. అప్పటికే చీకటి పడిపోవ‌డంతో ఆ చిన్నారులు ఇంటికి వెళ‌దామ‌నుకున్నార‌ని, అయితే, ఇంటికి వెళితే ఎక్క‌డికెళ్లారంటూ ఇంట్లో వారు తిడ‌తార‌ని భయపడి అక్క‌డే ఉన్నార‌ని చెప్పారు. అనంత‌రం అక్కడే తిరిగిన ఆ చిన్నారులు దారి మర్చిపోవ‌డంతో మ‌ళ్లీ ఇంటికి రాలేక‌పోయార‌ని తెలిపారు. ఆ పిల్ల‌ల త‌ల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందుకుని తాము పెట్రోలింగ్‌ చేస్తూ పిల్లల కోసం గాలించామ‌ని, ఈ రోజు ఉద‌యం థియేటర్‌కి దగ్గర్లోని ఓ ప్రాంతంలోనే వారు కనిపించార‌ని పోలీసులు చెప్పారు. 

  • Loading...

More Telugu News