: మరోసారి కవ్వింపు చర్యలకు దిగిన పాకిస్థాన్ ఆర్మీ.. ఒక పౌరుడి మృతి
ఎప్పటికప్పుడు భారత సైన్యం దీటుగా జవాబు ఇస్తున్నప్పటికీ, పాకిస్థాన్ ఆర్మీ తన తీరుని మార్చుకోవడం లేదు. ఈ రోజు జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కెరాన్ సెక్టార్ వద్ద మరోసారి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ.. అక్కడి కూలీలపై పాక్ కాల్పులకు తెగబడడంతో.. కూలీల్లో ఒకరు మృతి చెందారని, మరొకరికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున ఫూంచ్ సెక్టార్‌లోని కృష్ణఘాటి సెక్టార్ వద్ద ప్రవేశించడానికి ప్రయత్నించిన పాక్ చర్యలను భారత సైన్యం భగ్నం చేసింది. అనంతరం కొన్ని గంటల వ్యవధిలో ఈ చర్యకు పాల్పడింది.