: ఈ రోజు సాయంత్రం సంధ్యా థియేటర్ కు మా గ్యాంగ్ తో వస్తా: హీరో నిఖిల్


హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్న టాలీవుడ్ హీరో నిఖిల్ తాజా చిత్రం ‘కేశవ’కు కూడా అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో, ఈ సినిమాలో న‌టించిన రీతూ వర్మ, సుధీర్ వర్మతో పాటు త‌మ కేశవ గ్యాంగ్ ఈ రోజు సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ కు వస్తుందని నిఖిల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు. అంతేకాదు, తాము మరికొన్ని థియేటర్లకు కూడా వెళ్లి అభిమానులను కలుస్తామని చెప్పాడు. ఇటీవల కేశ‌వ టీమ్‌ విశాఖపట్నంలోని కొన్ని థియేటర్లలోనూ సంద‌డి చేసింది.      




    

  • Loading...

More Telugu News