: వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మి ఖాయ‌ం: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి


వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని మెజార్టీతో త‌మ పార్టీయే ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని సర్వే ద్వారా తేలింద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ప‌ట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం దేశంలో అత్యంత అవినీతి సర్కారని ఆయ‌న ఆరోపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మి ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఓట‌మి భ‌యంతోనే దొంగ సర్వేల పేరుతో కేసీఆర్ ఇటువంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. టీఆర్ఎస్‌కు ఏ సంస్థ ఆ సర్వే చేసి, ఇచ్చిందో చెప్పాలని ఆయ‌న డిమాండ్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు రాష్ట్ర‌ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు.                        

  • Loading...

More Telugu News