: 6 జీబీ ర్యామ్, నాలుగు కెమెరాలతో మిడ్ రేంజ్ ఫోన్... జియోనీ ఎస్ 10
ఇప్పటికే పలు విజయవంతమైన స్మార్ట్ ఫోన్ మోడళ్లను విడుదల చేసిన చైనా సంస్థ జియోనీ, మరో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఉన్న ఫోన్ ను ఆవిష్కరించింది. ముందు వెనుక నాలుగు కెమెరాలతో, 6 జీబీ ర్యామ్, 3,450 ఎంఏహెచ్ బ్యాటరీ, 5.5 అంగుళాల స్క్రీన్ తో ఉన్న జియోనీ ఎస్10ను చూపించింది. దీంతో పాటు ఎస్ 10సీ అమ్మకాలు జూన్ 9 నుంచి ఆరంభమవుతాయని, ఎస్10 బి అమ్మకాలు వెంటనే ప్రారంభిస్తున్నామని తెలిపింది. వెనుక వైపు 16, 8 ఎంపీ కెమెరాలు, ముందు వైపు 20, 8 ఎంపీ కెమెరాలు ఉండటం వీటి ప్రత్యేకత. మీడియా టెక్ హెలియో పీ 25 ప్రాసెసర్, 64 జీబీ ఇన్ బిల్ట్ మెమొరి, తదితర సదుపాయాలున్న ఎస్ 10 ధర సుమారు రూ. 24,400 అని పేర్కొంది. ఎస్ 10 బీ ధర రూ. 20,700, ఎస్ 10సీ ధర రూ. 15 వేల వరకూ ఉంటాయని వెల్లడించింది.