: పాక్ ఖైదీపై దాడి పట్ల భారత్ విచారం
జమ్మూలోని కోట్ బల్వాల్ జైలులో పాకిస్థాన్ ఖైదీపై దాడి ఘటన చాలా విచారించదగినదని భారత్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోందని, దోషులపై చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. ఖైదీ సనావుల్లాకు వైద్య సహాయం అందుతోందని, దౌత్య పరమైన సహకారం అందిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. పాక్ జైళ్లలో ఇద్దరు భారత ఖైదీలపై దాడులు, ఇక్కడ జమ్మూలో పాక్ ఖైదీపై దాడి నేపథ్యంలో భద్రతను పటిష్ఠం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం రెండు దేశాల అధికారుల మధ్య సమావేశం ఏర్పాటుకు ప్రతిపాదించామని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.