: ప్రమాద ఘంటికలు... భారత్ లో ముగ్గురికి సోకిన జికా వైరస్
ప్రపంచాన్ని గడగడలాడించిన ప్రాణాంతక జికా వైరస్ ఇండియాలోకి ప్రవేశించింది. అహ్మదాబాద్ నగరంలో ముగ్గురికి జికా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. బాధితుల్లో ఓ గర్భిణి కూడా ఉంది. గర్భస్థ శిశువుల మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపే ఈ వైరస్ ను నివారించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అహ్మదాబాద్ లో జికా సోకిన ముగ్గురికీ ప్రత్యేక చికిత్సను అందిస్తున్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి.
దోమల లాలాజలం ద్వారా ప్రధానంగా వ్యాపించే జికా, లైంగిక సంపర్కం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందని పరిశోధకులు తేల్చారు. ప్రాణాపాయం లేకపోయినా, జ్వరం, దద్దుర్లు, కీళ్ల నొప్పులు, వాంతులు తదితరాలతో పాటు తాత్కాలిక పక్షవాతం కూడా వస్తుంది. ఈ వ్యాధి విస్తరించకుండా దోమల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నిపుణులు సూచించారు.