: ఒక్కోటి ఒక్కో బాహుబలి!... నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రూ. కోటికి పైగా వసూళ్లు సాధించిన చిత్రాల వివరాలు!


'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రం రూ. 1500 కోట్లను దాటేసిందని, రూ. 2 వేల కోట్ల దిశగా దూసుకెళుతోందని సంబరాలు చేసుకుంటున్నాం. కానీ, ఆల్ ఇండియా రికార్డులను సృష్టించిన హిందీ చిత్రాల వసూళ్ల రికార్డులను తెలుగునేలపై సాధించిన ఘనత ఒక్క ఎన్టీ రామారావు చిత్రాలకే దక్కిందన్న విషయం ఎంత వరకూ తెలుసు? ఆయన నటించిన లవకుశ 1963లో రిలీజ్ కాగా, అప్పట్లోనే రూ. కోటికి పైగా వసూలు చేసింది. ఆపై కనీసం మూడు దశాబ్దాల పాటు రాష్ట్రంలోనే ఏదో ఒక థియేటరులో ఆ చిత్రం ఆడుతూనే ఉందని ఎంత మందికి తెలుసు. ఆ చిత్రం సాధించిన కలెక్షన్లను ఇప్పటి లెక్కలో ఎన్ని వందల కోట్లు అవుతుందని ఎలా లెక్కకట్టగలం?

ఒక్క లవకుశే కాదు... 1977లో వచ్చిన దానవీరశూరకర్ణ, అడవిరాముడు, యమగోల, 1979లో డ్రైవర్‌ రాముడు, వేటగాడు, 1980లో ఛాలెంజ్‌ రాముడు, సర్దార్‌ పాపారాయుడు, 1981లో గజదొంగ, కొండవీటి సింహం, 1982లో జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి, నాదేశం చిత్రాలన్నీ కోటి రూపాయలకు పైగా వసూళ్లు సాధించినవే. ఇదే సమయంలో వచ్చిన మిగతా చిత్రాల్లో శంకరాభరణం, ప్రేమాభిషేకం మాత్రమే ఆ ఘనతను సాధించాయి. ఇక తొలి వారం కలెక్షన్ల సత్తా చాటిన సినిమాగా బొబ్బిలిపులి నిలిచిపోయింది. 1982లో వచ్చిన ఈ చిత్రం మొదటి వారంలో రూ. 71 లక్షలు వసూలు చేయగా, ఆ సమయానికి అదే అతిపెద్ద రికార్డు. అంతెందుకు, బొబ్బిలిపులి వసూళ్లలో మూడో వంతు కూడా తొలి వారంలో మిగతా చిత్రాలకు రాలేదంటే, ఓ స్టార్ హీరో ఇండస్ట్రీని ఏకచ్ఛత్రాధిపత్యంతో ఎలా ఏలాడో తెలిసిపోతుంది.

  • Loading...

More Telugu News