: ఐసీసీ లైవ్ లో బుద్ధి బయటపెట్టుకున్న సానియా మీర్జా భర్త.... మండిపడుతున్న నెటిజన్లు... వీడియో చూడండి


ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే వివిధ దేశాల ఆటగాళ్లు సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులకు అందుబాటులో ఉండేలా ఐసీసీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు పాక్‌ ఆటగాడు, భారత మహిళా టెన్నిస్‌ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ పలు ప్రశ్నలకు బదులిచ్చాడు. తనకు పాక్, భారత్ లో ఆడడం ఇష్టమని చెప్పాడు. అయితే భారత్ లో ఆడడం కుదరడం లేదని అన్నాడు. భారత జట్టులోని సభ్యులంతా తనకు స్నేహితులేనని అన్నాడు. ఎందుకంటే తామంతా ఒకే బ్యాచ్‌ కి చెందినవాళ్లమని తెలిపాడు. గతంలో ఎన్నో మ్యాచులు కలిసి ఆడామని చెప్పాడు.

టీమిండియాలో మహ్మద్ షమీ కఠినమైన బౌలర్ అని, తనకు తెలిసి అతనిని ఎదుర్కోవడం కష్టమని చెప్పాడు. ఈ సమయంలో షోయబ్ మాలిక్ మతం ప్రస్తావన తీసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మతం ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. షమీ ముస్లిం అయినా భారతీయ బిడ్డ అని పలువురు పేర్కొంటున్నారు. మరికొందరు మతం పేరుతో విభజించే తోడేలు బుద్ధిని పాక్ ఆటగాడు బయటపెట్టుకున్నాడని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. షోయబ్ మాలిక్ మాట్లాడిన వీడియోలు చూడండి.











  • Loading...

More Telugu News