: లాలూ కుమార్తె మీసా భారతి డైరీలో 1000 ఎకరాలకు సంబంధించిన వివరాలు?


బీహార్ లో బీజేపీపై నిప్పులు చెరిగే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు గడ్డుకాలం ప్రారంభమైంది. భూవివాదం నేపథ్యంలో విచారణ చేపట్టిన ఐటీ శాఖ తాజాగా మరోసారి సోదాలు నిర్వహించింది. ఢిల్లీలో 1000 ఎకరాల స్థలానికి సంబంధించి ఐటీ అధికారులు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాలూ కుమార్తె మీసా భారతి డైరీని స్వాధీనం చేసుకుని, వారి వెంట తీసుకెళ్లారు. అందులో 1000 ఎకరాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్టు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. 

  • Loading...

More Telugu News