: ‘మహానాడు’కు డుమ్మా కొట్టి బయటకు పోకండి: చంద్రబాబు
‘మహానాడుకు డుమ్మా కొట్టకండి..బయటకు పోకండి’ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. విశాఖలో ప్రారంభమైన మహానాడులో ఆయన మాట్లాడుతూ, ‘ఎండ కూడా లేదు ప్లెజంట్ గా ఉంది. బీచ్ కు పోవాలనుకుంటే, సముద్రానికి పోవాలనుకుంటే, విశాఖపట్టణం చూడాలనుకుంటే ఉదయం, సాయంత్రం వెళ్లండి..మిగిలిన సమయంలో ఇక్కడే ఉండండి, మొత్తం స్టడీ చేయండి, సబ్జెక్ట్సన్నీ ఫాలో కండి, మీరు పూర్తిగా భాగస్వాములు కండి. అవసరమైతే, ఇంకా కోరిక ఉంటే, 29వ తేదీ తర్వాత ఒక రోజో రెండు రోజులో ఇక్కడే ఉండి పక్కనే ఉన్న అరకు, బుర్రా కేవ్స్ చూడండి. బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. అరక్ కు ప్రత్యేక రైలు కూడా ఉంది..’ అని చంద్రబాబు చెప్పడంతో నవ్వులు విరిశాయి.