: మహానాడు నుంచి అలిగి వెళ్లిపోయిన సినీ నటి కవిత
సినీ నటి కవితకు మహానాడులో చేదు అనుభవం ఎదురైంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపైకి తనను ఆహ్వానించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో, మహానాడు ప్రాంగణం నుంచి ఆమె వెళ్లిపోయారు. టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తనను వేదికపై కూర్చోబెట్టారని... అధికారంలోకి వచ్చాక తనను పక్కనపెట్టి అవమానిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.