: పోలీసులు రావద్దంటున్నా షహరాన్ పూర్ బయల్దేరిన రాహుల్!


ఉత్తరప్రదేశ్ షహరాన్ పూర్ జిల్లాలో దళితులు, రాజ్ పుత్ ఠాకూర్ల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రాజకీయ నాయకులు ఎవరూ ఈ ప్రాంతాన్ని సందర్శించవద్దని, ఎవరి పర్యటనలకు అనుమతి లేదని యూపీ అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) ఆదిత్య మిశ్రా నిన్న స్పష్టం చేశారు.

 అయితే, పోలీసు అధికారులు రావద్దంటున్నా ఆ ప్రాంతంలో పర్యటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయల్దేరారు. హింస చెలరేగిన ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి, బాధితులతో మాట్లాడాలని రాహుల్ భావిస్తున్నారు. మరి రాహుల్ పర్యటనపై యోగి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 

  • Loading...

More Telugu News