: కుంబ్లే స్థానంలో ద్రవిడ్ ను ఎంపిక చేస్తే బాగుంటుంది: రికీ పాంటింగ్


టీమిండియా హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే ఏడాది పదవీకాలం ముగుస్తుండటంతో... కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ అధ్యక్షుడు రికీ పాంటింగ్ టీమిండియా హెచ్ కోచ్ కు సంబంధించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కుంబ్లే స్థానంలో రాహుల్ ద్రవిడ్ ఎంపిక సరైనదని ఆయన చెప్పాడు. ఈ పదవిని చేపట్టాలనే కోరిక చాలా మందికి ఉంటుందని...  అయితే, కుంబ్లేకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని... కుదరని పక్షంలో ద్రవిడ్ కు పగ్గాలు అప్పజెప్పాలని సూచించాడు. ద్రవిడ్ కంటే గొప్ప వ్యక్తిని బీసీసీఐ ఎంపిక చేయలేదని చెప్పాడు. 

  • Loading...

More Telugu News