: కిటకిటలాడుతున్న వైజాగ్ రైల్వే స్టేషన్
టీడీపీ మహానాడుకు వస్తున్న పార్టీ కార్యకర్తలతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. పలు ప్రాంతాల నుంచి విశాఖకు వస్తున్న రైళ్లలో వేలాది మంది టీడీపీ మద్దతుదారుల విశాఖకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మహానాడు ప్రాంగణానికి వీరు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రాంగణానికి చేరుకుంటున్న వారికి అన్ని వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేశారు.