: పవన్ కల్యాణ్ కు రాయలసీమలో ఏం పని?: రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు రాయలసీమలో ఏం పని అని, ఆయనను ఇక్కడ అడుగు పెట్టనీయమని రాయలసీమ రాష్ట్ర సమితి (ఆర్ఆర్ఎస్) అధ్యక్షుడు కుంచం వెంకట సుబ్బారెడ్డి హెచ్చరించారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఎప్పడు పడితే అప్పుడు మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కోస్తాంధ్రలో పోటీ చేసుకోవాలని అన్నారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికి సంబంధించి 11 జిల్లాలతో బిల్లు ప్రవేశ పెట్టాలని ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు వెంకట సుబ్బారెడ్డి పేర్కొన్నారు.