: పోయెస్ గార్డెన్ మాకే సొంతం: జయలలిత మేనకోడలు దీప


దివంగత సీఎం జయలలిత ఆస్తుల గురించి ‘ఎంజీఆర్ అమ్మా దీప పేరవై’ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆమె మేనకోడలు దీప తాజాగా స్పందించారు. జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ తమకే సొంతమంటూ ఓ ప్రకటన చేశారు. జయలలిత నివాసాన్ని స్మృతి వనంగా మార్చాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయించడం కార్యకర్తలను మోసం చేయడమేనని ఆరోపించారు. ఆమె మరణించి ఇన్ని నెలలు అవుతున్నా పార్టీ తరపున చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించని వాళ్లా స్మృతి వనం తీర్మానాన్ని ప్రవేశపెట్టేది? అంటూ ఆమె విమర్శించారు. జయలలిత నివాసాన్ని ఆలయంగా భావిస్తున్నానని, స్మృతి వనం పేరిట పోయెస్ గార్డెన్ ను అపహరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ప్రకటనలో దీప ఆరోపించారు. జయలలితకు సంబంధించిన అన్ని ఆస్తులకు తాను, తన సోదరుడు దీపక్ మాత్రమే చట్టపరంగా వారసులమని తెలిపారు.

  • Loading...

More Telugu News