: ఎంపీ రామ్మోహన్ నాయుడి పెళ్లి ఆహ్వానపత్రిక అందుకున్నచంద్రబాబు


టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు వివాహం వచ్చే నెల 14న జరగనుంది. ఈ నేపథ్యంలో తన పెళ్లి ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు ఆయన అందజేశారు. తన బాబాయి అయిన ఏపీ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, తన తల్లి విజయలక్ష్మి, కుటుంబసభ్యులతో కలిసి రామ్మోహన్ నాయుడు సీఎం చంద్రబాబును నిన్న అమరావతిలో కలిశారు. శుభలేఖతో పాటు పట్టు వస్త్రాలను చంద్రబాబుకు సమర్పించి తన వివాహానికి హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, పెళ్లికి తప్పకహాజరవుతానని చెప్పారు. పెళ్లి ఏర్పాట్ల గురించి ఆయన ఆరా తీశారు. కాగా, విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ లో జూన్ 14వ తేదీ రాత్రి రామ్మోహన్ నాయుడు వివాహం,18వ తేదీన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో విందు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News