: టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా.. ఐదుగురి పరిస్థితి విషమం
టీఎస్ఆర్టీసీకి చెందిన గరుడ ఏసీ బస్సు బోల్తా కొట్టిన సంఘటన అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు గుత్తి మండలం వన్నెదొడ్డి వద్ద పది అడుగుల వంతెనపై బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో గాయపడ్డ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పదిహేను మంది గాయాల పాలయ్యారు. క్షతగాత్రులకు గుత్తి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అక్కడి నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించారు.