: బురఖా ధరిస్తే ఎండతగలదు.. డి-విటమిన్ లోపం వస్తుంది.. నిషేధం విధిస్తాం: యూకే ఇండిపెండెంట్ పార్టీ
తమ దేశంలో ముస్లిం మహిళలు బురఖాను ధరించకుండా నిషేధం విధిస్తామని యూకే ఇండిపెండెంట్ పార్టీ తమ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొంది. దానికిగల కారణాలు చెబుతూ బురఖా ధరించడం వల్ల సూర్యకిరణాలు ఒంటిపై పడవని, దీంతో డి-విటమిన్ లోపిస్తుందని తెలిపింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పని చేసేస్తామని పేర్కొంది. బురఖా ధరించడం వల్ల మరిన్ని నష్టాలు ఉన్నాయని వివరిస్తూ.. బురఖా ధరిస్తే గుర్తింపు తెలియదని, కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేరని, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొంది.