: షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ హీరో రణవీర్‌సింగ్


బాలీవుడ్‌ హీరో రణవీర్‌సింగ్ త‌ల‌కు గాయ‌మైంది. ఓ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న ఆయ‌న ప్ర‌స్తుతం మ‌ళ్లీ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న న‌టిస్తోన్న ‘పద్మావతి’ సినిమా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ..  తమ సినిమా షూటింగ్‌లో రణవీర్ గాయ‌ప‌డ్డాడ‌డ‌ని, అయినా ఆ గాయాన్ని పట్టించుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నాడ‌ని చెప్పారు. అయితే, తలకు తగిలిన దెబ్బ కారణంగా రక్తం వస్తోందని తాము గుర్తించి, రణవీర్‌ ను వెంటనే ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స చేయించామని తెలిపారు. ఆయ‌న ఇప్పుడు షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడ‌ని చెప్పారు. ‘పద్మావతి’ సినిమాను ద‌ర్శ‌కుడు సంజయ్‌ భన్సాలీ తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే.                             

  • Loading...

More Telugu News