: టెస్టింగ్ నిమిత్తం పోఖ్రాన్ కు చేరిన ఎం777 హవిట్జర్ గన్స్!


వచ్చే రెండు మూడు నెలల్లో ఉపయోగించనున్న ఎం 777 అల్ట్రా-లైట్ హవిట్జర్ గన్స్ ను టెస్టింగ్ నిమిత్తం రాజస్థాన్ లోని పోఖ్రాన్ కు చేరినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అమెరికన్ టీమ్ సహా రెండు ఎం 777 హవిట్జర్ గన్స్ రెండు రోజుల క్రితం ఫైరింగ్ రేంజ్ కు చేరాయని చెప్పారు. పలు రకాల మందు గుండు లేదా యుద్ధ సామగ్రిని ఈ గన్స్ ద్వారా పరీక్షించి, దీనిని అనుసరించి విశ్లేషణ నిర్వహిస్తామని తెలిపారు. బీఏఈ పద్ధతిలో తయారు చేసిన ఈ గన్స్ 2019 మార్చి నుంచి నెలకు ఐదు చొప్పున అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. కాగా, ఈ ఆయుధాల ఒప్పందం 2021వ సంవత్సరం మధ్య నాటికి పూర్తవుతుంది. హవిట్జర్ గన్స్ సరఫరా చేసే విషయమై గత ఏడాది నవంబర్ లో యూఎస్ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది.145 హవిట్జర్ గన్స్ ను మనకు సరఫరా చేసే నిమిత్తం అమెరికాతో రూ.5,000 కోట్లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.

  • Loading...

More Telugu News